ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
తనకు రంజిత్ రెడ్డి ఫోన్ చేశాడని, నానా బండ బూతులు తిట్టాడంటూ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు మాజీ ఎంపీ. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. ఈయన చేవెళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా హైకోర్టు అనుమతితో ఎంపీ రంజిత్ రెడ్డిపై ఐపీసీ 504 కింద కేసు నమోదు చేసినట్లు బంజరాహిల్స్ పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ ఫిర్యాదు తమకు ఈనెల 20న స్వయంగా మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు.
విచారణ అనంతరం తాజాగా ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంపీ రంజిత్ రెడ్డి వ్యవహారంపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయనే కాదు మొత్తం బీఆర్ఎస్ కు చెందిన నేతల వ్యవహారంపై ప్రజలు మండి పడుతున్నారు.