ఎనుముల..దుద్దిళ్ల దావోస్ టూర్
మూడు రోజులు 70 పారిశ్రామికవేత్తలు
దావోస్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బిజీగా ఉన్నారు. వారిద్దరూ ప్రస్తుతం దావోస్ టూర్ లో బిజీగా ఉన్నారు. అంతకు ముందు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని కలిసిన అనంతరం వెంటనే దావోస్ కు బయలు దేరి వెళ్లారు. రేవంత్ రెడ్డి వెంట దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల మీడియాతో మాట్లాడారు. భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా మూడు రోజుల పాటు పర్యటిస్తున్నామని తెలిపారు. ఈ టూర్ లో భాగంగా 70 మందికి పైగా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలను కలవ బోతున్నామని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన అంతర్జాతీయ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ లతో పాటు ఆయా సంస్థలకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లతో భేటీ కానున్నామని తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణ రాష్ట్ర బలా బలాలను వివరిస్తామని తెలిపారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.