ANDHRA PRADESHNEWS

ఎమ్మెల్యే ‘ఎర్ర‌కోట‌’కు జ‌గ‌న్ ఝ‌ల‌క్

Share it with your family & friends

మాజీ ఎంపీ బుట్టా రేణుక‌కు ఛాన్స్

అమ‌రావ‌తి – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోలుకోలేని షాక్ ఇచ్చారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పార్టీకి సంబంధించి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సీట్ల కేటాయింపులో భాగంగా ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎర్ర‌కోట కేశ‌వ రెడ్డికి షాకిచ్చారు. ఆయ‌న త‌న‌కు ఈసారి కూడా టికెట్ వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ అనూహ్యంగా త‌న సీటును మార్చ‌డం విస్తు పోయేలా చేసింది.

ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా క‌ర్నూలు జిల్లాలో అత్యంత ప్ర‌భావం క‌లిగిన నాయ‌కుడిగా ఎర్ర‌కోట కేశ‌వ రెడ్డికి పేరుంది. ఇదిలా ఉండ‌గా తాజాగా ప్ర‌క‌టించిన జాబితాలో ఎమ్మిగ‌నూరు స్థానానికి మాజీ ఎంపీ బుట్టా రేణుక‌కు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఖ‌రారు చేశారు. గ‌తంలో ప్ర‌క‌టించిన జాబితాలో కొన్ని మార్పుల‌తో కొత్త లిస్టును విడుద‌ల చేశారు.

న‌ర‌సారావుపేట‌, క‌ర్నూల్ , నంద్యాల ఎంపీ అభ్య‌ర్థుల పై ఇంకా కొలిక్కి రాలేదు. న‌ర‌సారావుపేట నుండి అనిల్ కుమార్ యాద‌వ్ , నంద్యాల నుండి ఎమ్మెల్సీ ఇక్బాల్ కు అవకాశం ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక జ‌య‌రాం లైన్ లోకి రాలేద‌ని ఆయ‌న‌కు క‌ర్నూల్ నుంచి బ‌రిలో నిలబెట్ట‌నున్న‌ట్లు టాక్.