ఎస్మా ప్రయోగం సర్కార్ కు శాపం
నిప్పులు చెరిగిన లోకేష్
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ బద్దంగా ఆందోళన చేస్తున్న అంగన్ వాడీలను పట్టించుకోక పోవడం దారుణమన్నారు. సర్కార్ అనాలోచిత నిర్ణయం కారణంగా ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు అంగన్ వాడీల మృతికి జగన్ రెడ్డినే కారణమని ఆరోపించారు నారా లోకేష్.
ఏపీ ప్రజలు పొరపాటున సైకో జగన్ కు పాలన అప్పగించారని, కానీ అరాచకాలు, అక్రమాలకు, అవినీతికి, దోపిడీకి తెర లేపాడని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆచరణకు నోచుకోని హామీలతో బురిడీ కొట్టించాడని , అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టాడని ధ్వజమెత్తారు.
ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని, జగన్ రెడ్డికి మూడిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి పవర్ లోకి రానుందని జోష్యం చెప్పారు నారా లోకేష్. అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు.
గత 40 రోజులుగా అంగన్ వాడీలు ఆందోళన చేస్తున్నారని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం దారుణమన్నారు. సీఎం ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట శాపంగా మారనుందని పేర్కొన్నారు.