ఏపీలో జోరుగా కుల గణన
ఈనెల 28 వరకు సర్వే
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన ప్రారంభమైంది. భారీ ఎత్తున రాష్ట్రానికి సంబంధించిన సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ షురూ అయ్యింది. ఈ కుల గణన 10 రోజుల పాటు కొనసాగనుంది. నేటి నుంచి ఈనెల 28 వరకు జరుగుతుంది.
సిబ్బంది, వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు. ఇంటింటికీ వెళతారు. వారి వివరాలు సేకరిస్తారు. పేరు , కులం, విద్యార్హతలు, ఏ పని చేస్తున్నారు, చదువుతున్న వారు ఎంత మంది, తదితర వాటిని నమోదు చేస్తారు.
ఇదిలా ఉండగా ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు రాష్ట్రంలోని సచివాలయాల్లో నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రతి ఒక్కరు తమ వివరాలు ఇవ్వాలని కోరింది.
దీని వల్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలంటే పూర్తి వివరాలు ఉండాలని స్పష్టం చేసింది.