ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ
ఓటర్ల జాబితా వెల్లడించిన ఈసీ
అమరావతి – కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈసారి పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారని పేర్కొంది. ఏకంగా 7 లక్షల మందికి పైగా మహిళా ఓటర్లు ఉండడం విశేషం. దీంతో వారే ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ప్రభావం చూపనున్నారు.
ఇక ఏపీ విషయానికి వస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256. ఇందులో 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 8,13,544. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాను ప్రకటించినట్లు వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.
ప్రస్తుతం ఏపీలో అధికారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ పార్టీ కొనసాగుతోంది. ఇక ప్రతిపక్షాలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం పార్టీలు ఉన్నాయి.
అయితే జనసేన, బీజేపీ గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉండగా ఈసారి తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిగా ముందుకు వెళ్లనున్నాయి.