నియామక పత్రం అందజేసిన గిడుగు..రఘువీరా
విజయవాడ – తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా వైఎస్ షర్మిలా రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బెజవాడలో జరిగిన పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు హాజరయ్యారు.
అంతకు ముందు వైఎస్ షర్మిలను వెళ్లకుండా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. దీనిపై సీరియస్ అయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి. తాను వచ్చాక సర్కార్ భయపడుతోందని అనిపిస్తోందన్నారు.
తాము న్యాయ బద్దంగా ముందస్తుగానే అనుమతి తీసుకున్నామని, అయినా అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి. అంతకు ముందు ఆమె తన తండ్రి సమాధి వద్దకు వెళ్లారు. అక్కడ తండ్రికి నివాళులు అర్పించారు. కడప నుంచి నేరుగా బెజవాడకు చేరుకున్నారు. భారీ కాన్వాయ్ వెంట రాగా షర్మిల పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్బంగా ఏఐసీసీ ఇచ్చిన నియామక పత్రాన్ని మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి షర్మిలకు అందజేశారు.