ఏపీ పీసీసీ చీఫ్ రేసులో షర్మిల
ప్రస్తుత చీఫ్ గిడుగు రాజీనామా
అమరావతి – ఏపీలో రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి పవర్ లోకి రావాలని అనుకుంటోంది. ఈ మేరకు పార్టీ బాస్, సీఎం జగన్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇంకో వైపు తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.
నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ తరుణంలో బీజేపీ కూడా జనసేనతో కలవాలని అనుకుంటోంది. అయితే గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో జత కట్టడం వల్ల కమలానికి డ్యామేజ్ జరిగిందనే ప్రచారం నెలకొంది.
ఈ తరుణంలో ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీకి అనూహ్యంగా విజయం దక్కింది తాజాగా జరిగిన ఎన్నికల్లో. అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రంలో హస్తం హవా కొనసాగింది. ఇక కేరళలో సీపీఎం, తమిళనాడులో డీఎంకే పవర్ లోకి వచ్చాయి.
బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ సమర్థవంతమైన నాయకత్వం లేక పోవడం వల్లనే పార్టీకి నష్టం జరిగిందని భావిస్తోంది ఏఐసీసీ. ఈ మేరకు ఏఐసీసీ గిడుగు రుద్రరాజును తప్పు కోవాలని సూచించింది. పార్టీ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.