అయోధ్యలో పవన్ కళ్యాణ్ తో
అయోధ్య – ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. కానీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి అయోధ్యలో తళుక్కున మెరిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి.
ఆ మధ్యన సమతా మూర్తి పేరుతో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఒక్క దానికే ఏకంగా రూ. 1,000 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. దేశ, విదేశాల నుంచి భారీ ఎత్తున విరాళాలు సమకూరాయి.
ఇది పక్కన పెడితే అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత రామ మందిరం పునః నిర్మించారు. శ్రీరాముడు ప్రతిష్ట కార్యక్రమం అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ మంతటా 7,000 మంది సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన వారికి ఆహ్వానం అందింది. వీరంతా కొలువు తీరారు.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఏకంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని లక్షకు పైగా పంపిణీ చేసింది. ఇది ఓ రికార్డ్. ఇదే సమయంలో చిన్నజీయర్, జూపల్లి, పవన్ కళ్యాణ్ ఒకే చోట దర్శనం ఇవ్వడం వైరల్ గా మారింది.