ENTERTAINMENT

ఓటీటీలో యానిమ‌ల్ మూవీ

Share it with your family & friends

ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్ రేపే

ముంబై – తెలుగు సినిమా రంగానికి చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన యానిమ‌ల్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టింది. ఇందులో ర‌ణ్ బీర్ క‌పూర్, ర‌ష్మిక మంద‌న్నా, అనిల్ క‌పూర్ , బాబీ డియోల్ , త‌దిత‌రులు న‌టించారు.

ఊహించ‌ని రీతిలో బిగ్ స‌క్సెస్ అందుకుంది. భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు దీనిని. నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. యానిమ‌ల్ ను డిఫ‌రెంట్ గా తెర కెక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు వంగా సందీప్ రెడ్డి. ఆయ‌న గ‌తంలో అర్జున్ రెడ్డి తీశాడు. అది హిట్. దానినే హిందీలో షాహిద్ క‌పూర్ తో తీశాడు. అది కూడా బిగ్ విజ‌యం సాధించింది.

ఇదిలా ఉండ‌గా భారీ ధ‌ర‌కు యానిమ‌ల్ అమ్ముడు పోయింది. ఏకంగా పోటీ ప‌డి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంద‌ని స‌మాచారం. హిందీతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంద‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది.