ఎవరైనా సరే ఒకే చోట ఓటు వేయాలి
అమరావతి – కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరైనా సరే ఒకే చోట మాత్రమే ఓటు వేయాలని స్పష్టం చేశారు. రెండు చోట్ల ఓటు వేస్తామంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ, లోక్ సభ ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేపట్టారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సీఈసీ మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో నివసిస్తున్న వారు ఎవ్వరైనా సరే ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలన్నారు. పుట్టిన ఊరు, స్వంత స్థలం అన్నది ముఖ్యం కాదన్నారు. ఇటు తెలంగాణలో అటు ఏపీలో రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించు కుంటున్నారంటూ తమకు ఫిర్యాదులు అందాయని చెప్పారు.
క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లు ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారంటూ ప్రశ్నించారు రాజీవ్ కుమార్. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా ఇక్కడ నివాసం ఉండగాకుండా ఉంటే ఓటు ఇవ్వలేని స్పష్టం చేశారు సీఈసీ.
రెండు చోట్ల దరఖాస్తు చేసుకుంటే తమకు తెలిసి పోతుందని అన్నారు. పలువురు దొంగ ఓట్ల నమోదుపై ఫిర్యాదులు అందాయని చెప్పారు.