ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహం
జనసేన నేత పోతిన మహేష్
విజయవాడ – ఏపీలో జగన్ రాక్షస పాలన సాగిస్తున్నాడని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్. ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. ఒకవేళ రాజ్యాంగ నిర్మాతపై ప్రేమ, గౌరవం ఉంటే ఇంత మంది దళితులు, బలహీన, మైనార్టీ వర్గాలపై దాడులు ఎందుకు జరుగుతాయని, కేసులు ఎందుకు నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు.
రాను రాను దళితులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ది పొందేందుకే ముందస్తు వ్యూహంలో భాగంగానే జగన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడని ధ్వజమెత్తారు పోతిన మహేష్.
కోన సీమ అంబేద్కర్ జిల్లా పేరుతో కుట్రలు చేసి చిచ్చు పెట్టారని మండిపడ్డారు. అంబేద్కర్ విదేశీ విద్యా పేరును తొలగించి జగనన్న విదేశీ విద్య పేరు ఎందుకు పెట్టారని నిలదీశారు. అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా..? అని అన్నారు.
2019 నుంచి నేటి వరకు దళితులపై జరిగిన దాడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. దళితుల పైనే ఎస్సీ, ఎస్టీ , కేసులు పెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దేనని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ పేరు ఎత్తి, విగ్రహాన్ని తాకే అర్హత జగన్‌కి లేదని అన్నారు.