కవితకు ఈడీ సమన్లు
లిక్కర్ స్కాం కేసులో షాక్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన నాయకురాలిగా గుర్తింపు పొందిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా నోటీసులు జారీ చేసింది.
స్కాంకు సంబంధించి తమ ముందుకు హాజరు కావాలని మరోసారి సమన్లు పంపించడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా కావాలని కేంద్రం తమను ఇబ్బంది పెట్టేందుకే దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆరోపించింది బీఆర్ఎస్ పార్టీ.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి కేరాఫ్ గా మారిందని, లక్షల కోట్లకు ఎలా పడగలెత్తారంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఒకానొక సమయంలో దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తనను కన్వీనర్ గా పెట్టుకుంటే ఎన్నికల ఖర్చు అంతా తానే భరిస్తానంటూ ప్రకటించారు బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్.
ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే కాంగ్రెస్ పార్టీ సీరియస్ కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆరోపించింది. ఆ మేరకు ఓట్లు పడేలా చేశాయి. ప్రస్తుతం ఈడీ సమన్లు జారీ చేయడంతో కవిత ఏం చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.