కాంట్రాక్టర్లకు తోపుదుర్తి బెదిరింపులు
ఆరోపించిన సీపీఐ నేత రామకృష్ణ
అనంతపురం – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఆయన అధికార పార్టీని టార్గెట్ చేశారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శనివారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు
కాంట్రాక్టర్లను బెదిరించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాలను మాను కోవాలని హితవు పలికారు రామకృష్ణ. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గుత్తేదారును బెదిరించారని ఆరోపించారు. అంతే కాకుండా పనుల్లో పాలు పంచుకుంటున్న కూలీలను కిడ్నాప్ చేశారని, ఈ విషయం తెలిసినా పోలీసులు పట్టించు కోలేదని ఆరోపించారు.
ఇది రాజారెడ్డి రాజ్యమా లేక జగన్ ఇష్టానుసారమా అని అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు అధికార పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. సదరు కాంట్రాక్టర్ వెళ్లి పశ్చిమ బెంగాల్ ఎంపీ ఖాన్ చౌదరికి ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై ఇతర రాష్ట్రాల ఎంపీలు స్పందించినా అనంతపురం జిల్లా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలకు ఊడిగం చేసేందుకేనా పోలీసులు ఉన్నారంటూ ప్రశ్నించారు సీపీఐ నేత రామకృష్ణ.