ENTERTAINMENT

కెప్టెన్ మిల్ల‌ర్ వ‌సూళ్ల వేట‌

Share it with your family & friends

రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి

త‌మిళ‌నాడు – కోలీవుడ్ కు చెందిన విల‌క్ష‌ణ న‌టుడు, గాయ‌కుడు ధ‌నుష్ కు ఈ ఏడాది క‌లిసి వ‌చ్చింది. త‌ను న‌టించిన కెప్టెన్ మిల్ల‌ర్ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. విడుద‌లైన ప్ర‌తి చోటా క‌లెక్ష‌న్ల వేట సాగిస్తోంది. మొత్తం 8 రోజుల‌కు గాను రూ. 90 కోట్ల‌ను దాటేసింది ఈ చిత్రం.

ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేసే అరుదైన న‌టుల్లో ఒక‌డు త‌మిళ చిత్ర‌సీమ‌కు చెందిన ధ‌నుష్. సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా టాలీవుడ్, కోలీవుడ్ నుంచి ప‌లు సినిమాలు రిలీజ్ అయ్యారు. ప్ర‌శాంత్ వ‌ర్మ తీసిన హ‌నుమాన్ చిత్రం రూ. 150 కోట్ల దిశగా సాగుతోంది.

ఇక ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన గుంటూరు కారం రూ. 200 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక కెప్టెన్ మిల్ల‌ర్ విష‌యానికి వ‌స్తే తొలి రోజు రూ. 16.29 కోట్లు వ‌సూలు చేసింది. ఇక 2వ రోజు రూ. 14.18 కోట్లు, 3వ రోజు రూ. 15.65 కోట్లు, 4వ రోజు రూ. 13.51 కోట్లు కొల్ల‌గొట్టింది.

5వ రోజు రూ. 12.24 కోట్లు వ‌సూలు చేసింది. 6వ రోజు 9.33 కోట్లు, 7వ రోజు రూ. 4.92 కోట్లు, 8వ రోజు రూ. 4.27 కోట్లు వ‌చ్చాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 8 రోజుల‌కు గాను కెప్టెన్ కిల్ల‌ర్ మూవీ రూ. 90.39 కోట్లు వ‌సూలు చేసింది. బాక్సులు బ‌ద్ద‌లు కొట్టేందుకు ఇంకొంచెం దూరంలో ఉంది.