కేసీఆర్ పట్ల కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండాలి
బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీజేపీ మాజీ చీఫ్, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు టచ్ లో ఉన్నారని, వారిని కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరిగేందుకు ఛాన్స్ ఉందన్నారు బండి సంజయ్ కుమార్. కేసీఆర్ ప్లాన్, కదలికలపై కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు బండి సంజయ్ కుమార్.
కేసీఆర్ అధికారం విడిచి ఉండలేడని, ఆయన ఊరుకుంటే పెద్ద ప్రమాదమని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు . తమ వల్లనే సుస్థిరమైన పాలన సాధ్యమవుతుందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీజేపీ ప్రతిపక్షంగా ఉండాలన్నారు. తాము నిత్యం ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్.