కేసీఆర్ పై రాములమ్మ సెటైర్
గరుకు రాళ్లు..గట్టి నేలపై నడవాలి
హైదరాబాద్ – మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాజీ సీఎం , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని, నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్బంగా పాలిష్ బండలపై నడిస్తే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్ కే కాదు ప్రజలకు కూడా పలు సూచనలు చేశారు. ప్రజలకు చెందిన ధనాన్ని దుబారా చేశారని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు విజయ శాంతి.
పైసలకు లెక్కకు మించి ఖర్చు చేసి గొప్పతనాలకు పోయారని, లెక్కలేనన్ని సమస్యలు తెచ్చుకున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. గరుకు రాళ్లు, గట్టి నేలపై నడిచేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఇలా చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.
తాజాగా విజయ శాంతి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆమె మొదటి నుంచీ కేసీఆర్ ను , బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కల్వకుంట్ల కుటుంబాన్ని, వాళ్లు చేసిన దోపిడీని ప్రశ్నిస్తూ వచ్చారు. మొత్తంగా కేసీఆర్ విజయశాంతి చేసిన కామెంట్స్ కు స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.