కొలువు తీరిన మహేందర్ రెడ్డి
టీఎస్పీఎస్సీ చైర్మన్ గా సంతకం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కొలువు తీరారు. జనవరి 26 శుక్రవారం గణ తంత్ర దినోత్సవం రోజున ఆయన టీఎస్పీఎస్సీ ఆఫీసులో జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు. అనంతరం నేరుగా చైర్మన్ గా సంతకం చేశారు. కుర్చీపై ఆసీనులయ్యారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం మారడంతో ఎవరిని చైర్మన్ గా , సభ్యులుగా నియమిస్తారనే దానిపై ఉత్కంఠ రేపింది. దీనికి తెలివిగా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరాక రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా పదవులు ఇచ్చారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇందుకు తగ్గట్టుగానే కీలకమైన పోస్టులన్నీ వారికే ఇవ్వడం గమనార్హం.
ఇంకా కొన్ని నెలల్లోనే మహేందర్ రెడ్డి రిటైర్ కావాల్సి ఉండగా ఎందుకు చైర్మన్ పదవి కట్టబెట్టారని పలువురు ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఉద్యమకారులు, ఆందోళనకారులు, నిరుద్యోగులపై దాడులు పెరిగాయని, పలువురిపై కేసులు కూడా నమదు చేశారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తంగా పోలీస్ కు పోస్టుల భర్తీ అప్పగించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.