కోహ్లీకి షాక్ పాటిదార్ కు ఛాన్స్
రెండు టెస్టులకు రన్ మెషీన్ దూరం
ముంబై – భారత్ లో పర్యటించే ఇంగ్లండ్ తో ఆడే టెస్టు మ్యాచ్ లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది బీసీసీఐ . స్టార్ క్రికెటర్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీని తప్పించింది. వ్యక్తిగత కారణాలతో తాను ఆడలేనంటూ పేర్కొంటున్నా బీసీసీఐ కావాలని పక్కన పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో భాగంగా ఈనెల 26న గురువారం హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్ తో ఆడనుంది. విరాట్ కోహ్లీ లేక పోవడంతో ఆయన స్థానంలో యంగ్ క్రికెటర్ రజత్ పాటిదార్ ను ఎంపిక చేసింది. ఇది ఎవరూ ఊహించ లేదు.
విచిత్రం ఏమిటంటే విరాట్, రజత్ ఇద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టలో కలిసి ఆడారు. రెండు టెస్టులకు దూరంగా ఉంచినట్లు పేర్కొంది బీసీసీఐ. గత వారం అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో రజిత్ పాటిదార్ 151 పరుగులు చేశాడు. బీసీసీఐ సెలెక్టర్లను ఆకర్షించేలా చేసింది.
ఇదిలా ఉండగా రజిత్ పాటిదార్ ను కాకుండా సంజూ శాంసన్ , ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలలో ఎవరో ఒకరిని తీసుకుంటారని భావించారు.