NEWSTELANGANA

గ‌ద్ద‌ర్ జ‌యంతిని అధికారికంగా చేప‌ట్టాలి

Share it with your family & friends

పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కు వెన్నెల విన‌తి

హైద‌రాబాద్ – ప్ర‌జా గాయ‌కుడు, యుద్ద నౌక దివంగ‌త గ‌ద్ద‌ర్ జ‌యంతి జ‌న‌వ‌రి 31. ఈ సంద‌ర్బంగా గ‌ద్ద‌ర్ కూతురు వెన్నెల గ‌ద్ద‌ర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యానికి చేరుకున్నారు. రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ తో భేటీ అయ్యారు. గ‌ద్ద‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించాల‌ని మంత్రిని కోరారు.

దీనిపై ఆలోచిస్తామ‌ని, సీఎం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నార‌ని వ‌చ్చిన త‌ర్వాత కేబినెట్ భేటీ అవుతుంద‌ని తెలిపారు. అంద‌రితో చ‌ర్చించి త‌గు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు వెన్నెలా గ‌ద్ద‌ర్ కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

సీఎం దృష్టికి తీసుకు వెళ్లి త‌ప్ప‌కుండా అధికారికంగా ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ‌యంతిని నిర్వ‌హించేలా తాను కృషి చేస్తాన‌ని మాటిచ్చారు మంత్రి. ఇటీవ‌లే గ‌ద్ద‌ర్ గుండె పోటుతో మృతి చెందారు. ప్ర‌భుత్వం అధికారిక లాంఛనాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది.

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించారు ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్. ఆయ‌న పాట‌ల‌తో ఉర్రూత లూగించారు. కోట్లాది ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేశారు. ఆయ‌న పాడ‌ని పాటంటూ లేదు. న‌క్స‌లైట్ ఉద్య‌మానికి ఊపిరి పోశారు. చివ‌ర‌కు ఆయ‌న త‌న క‌ల‌ను సాకారం చేసుకోకుండానే త‌నువు చాలించారు.