Sunday, April 6, 2025
HomeNEWSANDHRA PRADESHగ‌వ‌ర్న‌ర్ తో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భేటీ

గ‌వ‌ర్న‌ర్ తో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భేటీ

25న ఓట‌రు దినోత్స‌వానికి ఆహ్వానం

విజ‌య‌వాడ – ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ మ‌హేష్ కుమార్ మీనా గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ అహ్మ‌ద్ తో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు. విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్ కు చేరుకున్నారు. వీరి భేటిలో ప్ర‌ధానంగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా ఈనెల 25న దేశ వ్యాప్తంగా ఓట‌రు దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. దీనిని పుర‌స్క‌రించుకుని ఏపీలో కూడా ఘ‌ణంగా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌ని తెలిపారు గ‌వ‌ర్న‌ర్ కు సీఈఓ. జాతీయ ఓట‌రు దినోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కోరారు.

వివిధ అంశాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఓటు విలువ అత్యంత ముఖ్య‌మైన‌ద‌ని, దాని విలువ గురించి చైత‌న్య‌వంతం చేయాల్సిన బాధ్య‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ఉంద‌ని పేర్కొన్నారు గ‌వ‌ర్న‌ర్. ప్ర‌తి ఒక్క‌రు ఓటు వేసేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు .

2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్న మవుతున్న తరుణంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతున్న అంశాలను, పలు కార్యకలాపాలను మీనా గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. ఓటర్ల తుది జాబితా విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రణాళికను వివరించారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments