ప్రజలకు ఆమెనే జవాబుదారీ
హైదరాబాద్ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా పబ్లిక్ గార్డెన్స్ వేదికగా గవర్నర్ చేసిన ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సింది గవర్నరేనని, ఫక్తు రాజకీయ ప్రసంగం చేయడం మంచి పద్దతి కాదన్నారు. మార్చుకుంటే బెటర్ అంటూ సూచన చేశారు కేటీఆర్.
ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు. ఆయన అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు . తాము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని, మేమే పవర్ లో ఉన్నామని అనుకుంటున్నట్లుగా ఉందన్నారు కేటీఆర్.
ఈ సందర్బంగా మాజీ మంత్రి ఓ పద్యాన్ని కూడా ఉదహరించారు. కనకపు సింహాసమున శునకమును కూర్చుండ బెట్టిన అని ప్రస్తావించారు. కాగా రాజకీయంగా అనుబంధం ఉందంటూ తాము ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన డాక్టర్ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను తిరస్కరించిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కోదండ రామ్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎలా అంగీకరిస్తారంటూ ప్రశ్నించారు.
దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉందని తేలి పోయిందన్నారు కేటీఆర్. బండి సంజయ్ కూడా ఇదే తీరుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.