NEWSTELANGANA

గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Share it with your family & friends

స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాలి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) చైర్మ‌న్ బి. జ‌నార్ద‌న్ రెడ్డి, స‌భ్యులు రాజీనామాల‌ను ఆమోదించారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అయితే ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప‌రీక్ష పేప‌ర్ల లీకేజీ, త‌దిత‌ర వ్య‌వ‌హారాల‌పై గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్ అయ్యారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. వీటిపై సీరియ‌స్ గా విచార‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు గ‌వ‌ర్న‌ర్. ఈ త‌తంగానికి పాల్ప‌డిన దోషుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ఎవ‌రు ఏ స్థాయిలో ఉన్నా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు గ‌వ‌ర్న‌ర్. భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో టీఎస్పీఎస్సీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన అన్ని ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు. కొత్త స‌ర్కార్ వ‌చ్చాక నూత‌న చైర్మ‌న్, స‌భ్యుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.

ఈ ఏడాది లోపు 2 ల‌క్ష‌ల జాబ్స్ ను త‌ప్ప‌కుండా భ‌ర్తీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 39 ల‌క్ష‌ల మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. వీరంద‌రికి ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుతో ఉపాధి క‌ల్పిస్తామ‌ని తెలిపారు సీఎం.