ENTERTAINMENT

గుంటూరు కారం ట్రైల‌ర్ సూప‌ర్

Share it with your family & friends

ఆశించిన స్థాయిలో త్రివిక్ర‌మ్ మూవీ

మ‌రోసారి త‌న మార్క్ ఏమిటో చూపించాడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గుంటూరు కారం చిత్రం ట్రైల‌ర్ విడుద‌లైంది. హైద‌రాబాద్ లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్ లో ఈ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున అభిమానుల కేరింత‌ల మ‌ధ్య కెవ్వు కేక అనిపించేలా ఉంది.

గ‌తంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, అందాల బొమ్మ శ్రీ‌లీల క‌లిసి న‌టించిన ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌ధానంగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అంటేనే డైలాగుల‌కు పెట్టింది పేరు. ప్రిన్స్ న‌టించిన అత‌డు, ఖ‌లేజా చిత్రాలు జ‌నాద‌ర‌ణ పొందాయి. మ‌హేష్ బాబు సినీ కెరీర్ లో మ‌రిచి పోలేని చిత్రంగా అత‌డు నిలిచి పోయింది.

వాటి కంటే భిన్నంగా ప్రిన్స్ ను చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు మాట‌ల మాంత్రికుడు. ముచ్చ‌ట‌గా వీరిద్ద‌రి కాంబినేష‌న్ మూడోది కావ‌డం విశేషం. అందుకే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎస్ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందించిన గుంటూరు కారం త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు అభిమానులు.

ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి రిలీజైన పోస్ట‌ర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఇక తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ప్ర‌ధానంగా మ‌హేష్ బాబు డైలాగులు గుండెకు హ‌త్తుకునేలా ఉన్నాయి. త‌న న‌ట‌న పీక్ కు చేరింది. మొత్తంగా ప్రిన్స్ ను డిఫ‌రెంట్ గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్.

ఈనెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా గుంటూరు కారం విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ముంద‌స్తు టికెట్లు కూడా అమ్మ‌డం స్టార్ట్ చేశారు.