గురువాయూర్ గుడిలో ప్రధాని
దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా
త్రిసూర్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం దేశంలో అత్యంత ప్రసిద్దమైన దేవాలయాలలో ఒకటైన కేరళ లోని త్రిసూర్ కే తలమానికంగా నిలిచిన గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు, పాలక మండలి ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మోదీ పూజలు చేశారు. అనంతరం పూజారులు ఆశీర్వచనం అందజేశారు. అంతకు ముందు నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేశారు.
ఇదే గుడిలో ప్రముఖ నటుడు , మాజీ రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి, రాధిక పెద్ద కూతురు వివాహానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. ఆయనే దగ్గరుండి జరిపించడం విశేషం. వధూవరులు ఇద్దరినీ ఆశీర్వదించారు .
ఇదిలా ఉండగా గురువాయూర్ , ద్వారక ఆలయాల మధ్య దగ్గరి అనుబంధం ఉందన్న నానుడి ఉంది. ద్వాపర యుగం చివరలో ద్వారక వరదలో మునిగి పోతున్నప్పుడు, కృష్ణుడు తన స్నేహితుడు ఉద్ధవుడిని వెళ్లి ద్వారక నుండి విష్ణువు విగ్రహాన్ని తీసుకురావాలని కోరాడు.
ఉద్ధవుడు ప్రళయం నుండి విగ్రహాన్ని పొందాడు. కృష్ణుడు బృహస్పతి ఋషిని – దేవతల గురువైన ఋషిని దక్షిణ దిక్కున ఉన్న ఒక అనువైన ప్రదేశానికి తీసుకువెళ్లి, ప్రజలు పూజించడానికి దానిని స్థాపించమని కోరాడు.
గురువు, అతని ప్రధాన శిష్యుడు, వాయుదేవ్ – పవనాల ప్రభువు వారి ప్రయాణాన్ని ప్రారంభించారు . ఆ ప్రదేశంలో విగ్రహాన్ని ప్రతిష్టించిన పరశురాముడిని కలుసుకున్నారు. దీనినే గురువాయూర్ అని పిలుస్తున్నారు.