Friday, April 4, 2025
HomeBUSINESSగూగుల్ లో భారీగా కొలువుల కోత

గూగుల్ లో భారీగా కొలువుల కోత

అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చు పేరుతో తొల‌గింపు

అమెరికా- ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం గూగుల్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. టెక్నాల‌జీలో రోజు రోజుకు కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి దిగ్గ‌జ కంపెనీల‌పై పెను భారం ప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో కాస్ట్ క‌టింగ్ పేరుతో భారీ ఎత్తున ఉద్యోగుల‌ను తొల‌గించింది. దీనిపై గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా టెక్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఉన్న‌ట్టుండి చెప్ప‌కుండా ఇలా పింక్ స్లిప్పులు ఇస్తే ఎలా అని ప్ర‌శ్నించింది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొంది.

ఇక తాజాగా గూగుల్ ఇంజ‌నీరింగ్, ఇత‌ర విభాగాల‌లో వంద‌ల కొద్ది ఉద్యోగుల‌ను తొల‌గించింది. కోర్ ఇంజ‌నీరింగ్ , గూగుల్ అసిస్టెంట్ ఉత్ప‌త్తి, పిక్సెల్ ఫోన్ వంటి హార్డ్ వేర్ ల‌లో ప‌ని చేస్తున్న వారికి ఝ‌ల‌క్ ఇచ్చింది. కొన్ని ఏళ్లుగా వీళ్లు న‌మ్ముకుని ప‌ని చేస్తున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది 2023 సెప్టెంబ‌ర్ 30 నాటికి గూగుల్ సంస్థ‌లో 1,82,000 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. సిలీకాన్ వ్యాలీలో ఇది కొలువు తీరి ఉంది. వాయిస్ ఆప‌రేటెడ్ వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్ విభాగంలో ప‌ని చేస్తున్న వారికి చెక్ పెట్టింది. వంద‌లాది మంది కార్పొరేట్ యాక్సెస్ ను కూడా కోల్పోయారు. మిమ్మ‌ల్ని తొల‌గిస్తున్నందుకు చింతిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments