నేడే వెల్లడించనున్న సుప్రీంకోర్టు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఏపీ స్కిల్ స్కాం కేసుపై మంగళవారం తుది తీర్పు వెలువరించనుంది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు.
ఇప్పటికే ఏపీ సీఐడీ ఏకంగా ఎనిమిది కేసులు నమోదు చేసింది చంద్రబాబుపై. ఏపీ స్కిల్ స్కాంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కూడా ఉంది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ బాబు కూడా ఉన్నారు.
ఇక ఏపీ స్కిల్ స్కాం కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏకంగా 53 రోజుల పాటు ఉన్నారు. పర్మినెంట్ బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ ఇంకా పలు కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. త్వరలో ఏపీలో ఎలక్షన్స్ జరగనున్నాయి.
మరో వైపు సెక్షన్ 409 కింద స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యారు. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని, కానీ అలా పర్మిషన్ తీసుకోలేదని, తన అరెస్ట్ అక్రమమంటూ చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు కొట్టి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ తీర్పు వెలువరించనుంది.