Friday, April 4, 2025
HomeNEWSANDHRA PRADESHచిరు వ్యాపారుల‌కు రూ. 431.58 కోట్లు

చిరు వ్యాపారుల‌కు రూ. 431.58 కోట్లు

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కానుక

అమ‌రావ‌తి – రాష్ట్రంలో ఓ వైపు ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు వైసీపీ బాస్, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. తాను తీసుకు వ‌చ్చిన సంక్షేమ ప‌థ‌కాలే త‌నను తిరిగి రెండోసారి అధికారంలోకి తీసుకు వ‌చ్చేలా చేస్తాయ‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. ఇందులో భాగంగా ల‌బ్దిదారుల‌కు మేలు చేకూర్చేలా నిధులు స‌మ‌కూరుస్తున్నారు.

తాజాగా ఇత‌రుల‌పై ఆధార ప‌డ‌కుండా స్వ‌యం ఉపాధితో జీవిస్తూ ఇత‌రుల‌కు అండ‌గా ఉంటున్న చిరు వ్యాపారుల‌కు సాయం చేస్తోంది ఏపీ స‌ర్కార్. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగున్న‌ర ఏళ్ల కాలంలో ఏడు విడ‌త‌లుగా రాష్ట్రంలోని చిరు వ్యాపార‌స్తుల‌కు ఆర్థిక సాయం అంద‌జేశారు సీఎం.

జ‌గ‌న‌న్న తోడు పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప‌థ‌కం వేలాది మంది చిరు వ్యాపారస్తుల‌కు ఆలంబ‌న‌గా మారింది. ఇవాళ పూర్తి వ‌డ్డీ భారాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రించేలా దీనిని రూపొందించారు. ఒక్కొక్క‌రికి రూ. 10,000ల‌తో పాటు అంత‌కంటే ఎక్కువ మొత్త‌న్నా వారి ఖాతాల్లో నేరుగా జ‌మ చేస్తున్నారు.

రాష్ట్రంలోని 3,95,000 మంది చిరు వ్యాపారుల‌కు రూ. 417.94 కోట్ల వ‌డ్డీ లోని కొత్త రుణాలు అంద‌జేస్తున్నారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీతో కలిపి మొత్తం రూ. 431.58 కోట్లను బ‌ట‌న్ నొక్కి జ‌గ‌న్ రెడ్డి జ‌మ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments