నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ రాజకీయ వ్యాపారి అని సంచలన ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. మీరంతా తాగడంలో బిజీగా ఉంటే మీకు సంబంధించిన డబ్బుల గురించి లెక్కలు వేస్తున్నాడంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. నవ రత్నాలు పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని, ఆ తర్వాత రాష్ట్రం పాలిట శాపంగా మారాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. ఆరు నూరైనా , ఎన్ని అడ్డంకులు కల్పించినా ఏపీలో రాబోయేది టీడీపీ, జనసేన కూటమి అని కుండ బద్దలు కొట్టారు.
ప్రజలు దౌర్జన్య, దమనకాండ పాలన పట్ల విసిగి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో కనీసం తమకు 150కి పైగా సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ముందస్తుగా తాము అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కీలక ప్రకటన చేయడం తప్పేనని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా తప్పుగా భావించవద్దంటూ పవన్ కళ్యాణ్ ను కోరారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనుడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.