ANDHRA PRADESHNEWS

జ‌గ‌న్ ఖేల్ ఖ‌తం – బాబు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన టీడీపీ చీఫ్

ఆచంట – ఏపీలో సైకో పాల‌న త్వ‌ర‌లోనే ముగుస్తుంద‌ని ఇక ప్ర‌జా పాల‌న కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తూర్పు గోదావ‌రి జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆచంట‌లో ఏర్పాటు చేసిన టీడీపీ భారీ బహిరంగ స‌భ‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు ప్ర‌సంగించారు.

ప్ర‌ధానంగా వైసీపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. సైకో పాల‌న పోవాల‌ని సైకిల్ పాల‌న రావాల‌ని పిలుపునిచ్చారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రా క‌ద‌లి రా స‌భ‌కు ఇంత పెద్ద ఎత్తున వ‌చ్చిన ప్ర‌జానీకాన్ని చూస్తుంటే ఇక జ‌గ‌న్ కు రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని అర్థం అవుతోంద‌న్నారు. తాను మ‌చ్చ లేని నాయ‌కుడిన‌ని, కానీ త‌న‌ను కావాల‌ని జైలుకు పంపించేలా చేశాడ‌ని ఆరోపించారు.

జ‌న జైత్ర యాత్ర‌కు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు అపూర్వ‌మైన రీతిలో ఆద‌రించార‌ని వారిని అభినందిస్తున్న‌ట్లు చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌జ‌ల్ని హింసించే స‌ర్కార్ సినిమా అయి పోయింద‌న్నారు. ఇక ప్ర‌జ‌లు శుభం కార్డు ప‌లికేందుకు సిద్దంగా ఉన్నార‌ని జోష్యం చెప్పారు.