ANDHRA PRADESHNEWS

జ‌గ‌న్ పాల‌న‌లో జ‌నం ద‌గా

Share it with your family & friends

నారా చంద్ర‌బాబు నాయుడు ఫైర్

తిరువూరు – తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌ధానంగా వైసీపీ చీఫ్‌, సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆదివారం తిరువూరులో రా క‌ద‌లి రా బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. అశేష ప్ర‌జావాణిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

జ‌గ‌న్ పాల‌న‌లో రైతుల‌కు ఒరిగింది ఏమీ లేద‌న్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో విఫ‌లం అయ్యార‌ని ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు. అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం టాప్ లో ఉంద‌న్నారు. కౌలు రైతులు బ‌ల‌వంత‌పు మ‌ర‌ణాల‌లో నెంబ‌ర్ 2లో ఉంద‌ని , ఇక రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డంలో 3వ స్థానంలో ఏపీ ఉండ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

సైకో జ‌గ‌న్ పోవాల‌ని సైకిల్ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. వైసీపీని గ‌ద్దె దించేందుకు ప్ర‌జ‌లంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు.

సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాన్ని మోసం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పూర్తిగా అప్పుల కుప్ప‌గా మార్చాడ‌ని మండిప‌డ్డారు.