జగన్ రెడ్డిపై మందకృష్ణ గుస్సా
4 లోక్ సభ 29 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి
గుంటూరు – ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. గురువారం గుంటూరులో మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్ల పాటు అన్ని పార్టీలు తమను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని ఆరోపించారు.
కేవలం బీజేపీ మాత్రమే తమ ఆవేదనను అర్థం చేసుకుందన్నారు. అందుకే ప్రధాన మంత్రి మోదీ స్వయంగా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఒప్పుకున్నారని, ఆ మేరకు కమిటీ కూడా చేశారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా దళితుల ఓట్లు కావాలంటే దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ , శాసన సభ ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాసన సభకు సంబంధించి 29 ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వాలని , ఇక లోక్ సభకు సంబంధించి 4 సీట్లు ఇవ్వాలని కోరారు.
రాజకీయ పరంగా పోటీ చేయాలా వద్దా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. అయితే తొలి ప్రాధాన్యత మాత్రం వైసీపీ చీఫ్, సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇస్తామని చెప్పారు మందకృష్ణ మాదిగ. రెండో ప్రయారిటీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఇస్తామన్నారు.
కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ఓటు బ్యాంకు అత్యధికంగా రాష్ట్రంలో ఉందన్న సంగతి మరిచి పోవదన్నారు.