NATIONALNEWS

జ‌గ‌మంతా రామ మ‌యం

Share it with your family & friends

ముస్తాబైన అయోధ్య క్షేత్రం

ఉత్త‌ర ప్ర‌దేశ్ – యూపీలోని అయోధ్య రామ మందిరం ప్రాణ ప్ర‌తిష్ట‌కు ముస్తాబైంది. జ‌గ‌మంతా ఎంతో ఆస‌క్తితో, ఆతృత‌తో, ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తోంది. ఉద‌యం 10 గంట‌ల‌కు బాలాల‌యంలోకి ప్ర‌వేశించారు.

మ‌ధ్యాహ్నం 12.20 గంట‌ల‌కు రామ మందిర ప్రాణ ప్ర‌తిష్టా కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ప్ర‌ధాన పూజ అభిజిత్ ముహూర్తంలో జ‌ర‌గ‌నుంది. ఇక శుభ ముహూర్తం 12 గంట‌ల 29 నిమిషాల 8 సెక‌న్ల‌కు ఉంద‌ని పండితులు తెలిపారు. ఈ మేర‌కు యూపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో రామ జ‌న్మ భూమి ట్ర‌స్టు స‌మ‌క్షంలో న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు.

దేశ వ్యాప్తంగా అత్య‌ధిక రాష్ట్రాలు సెల‌వు ప్ర‌క‌టించాయి. కొన్ని రాష్ట్రాలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అయోధ్య రామాల‌యం దేశానికి ప్ర‌తిష్టాత్మ‌కమైనద‌ని కేంద్రం పేర్కొంది. ఈ సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించుకు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోని సంస్థ‌ల‌కు హాఫ్ డే హాలీడేను ప్ర‌క‌టించింది. దీనిపై వామ‌ప‌క్షాలు అభ్యంత‌రం తెలిపాయి.

మ‌తం ఆధారంగా చేసుకునే ఏ కార్య‌క్ర‌మానికి సెల‌వు ఇవ్వ‌కూడ‌ద‌ని ఇది రాజ్యాంగానికి వ్య‌తిరేక‌మే అవుతుంద‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ఇవాళ ప్ర‌ముఖ రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ త‌మ ఉద్యోగులంద‌రికీ సెల‌వు ప్ర‌క‌టించింది.