జనసేనానితో కొణతాల ములాఖత్
త్వరలోనే పవన్ పార్టీలో చేరిక
అమరావతి – ఏపీలో పాలిటిక్స్ వేగంగా మారి పోతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఇదే సమయంలో మాజీ మంత్రిగా ఉన్న కొణతాల రామకృష్ణ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. ఆయన బుధవారం జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తో ములాఖత్ అయ్యారు.
త్వరలోనే జనసేన పార్టీలోకి చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ సంభాషణ కొనసాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ఆరా తీశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడతో పవన్ కళ్యాణ్ జత కట్టారు. ఇద్దరూ కలిసి ఈసారి ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఈ సమయంలో సీట్ల సర్దుబాటుపై ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. అసెంబ్లీ సీట్లు 50 , లోక్ సభ సీట్లు 10 దాకా జనసేన పార్టీ అడుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇవాళ తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై కూడా కొణతాల రామకృష్ణ క్లారిటీ ఇచ్చినట్టు టాక్.
ఆయన అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారని పార్టీ వర్గాల భోగట్టా.