జనసేన అభ్యర్థుల ప్రకటన
వెల్లడించిన పవన్ కళ్యాణ్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. పొత్తు ధర్మం పాటించక పోతే ఎలా అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరూ ఊహించని రీతిలో తమ పార్టీ పరంగా ఇద్దరిని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. అయితే త్వరలోనే సీట్ల పంపకంపై స్పష్టత వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా ఏపీలోని రాజోలు, రాజనగరంలో తమ పార్టీ బరిలో ఉంటుందని పేర్కొన్నారు.
నారా లోకేష్ పదే పదే చంద్రబాబు నాయుడు సీఎం అవుతారంటూ ప్రకటించడం మంచి పద్దతి కాదన్నారు. ఇది పొత్తు ధర్మాన్ని దాటి పోవడం తప్ప మరోకటి కాదన్నారు. దీనిని తాము హర్షించ బోమంటూ కుండ బద్దలు కొట్టారు. అయితే టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై ఆందోళన చెంద వద్దంటూ సూచించారు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు.