జిల్లాల్లో నైపుణ్య కేంద్రాలు
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయన పాలనా పరంగా పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల హామీల అమలుపై దృష్టి సారించారు.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విధి విధానాలను, మార్గదర్శకాలను రూపొందించాలని సీఎస్ శాంతి కుమారికి సూచించారు.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, నైపుణ్యం కలిగిన వారిని నియమించాలని, నిరంతరం శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షించారు.
గత ప్రభుత్వం ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు, నైపుణ్యాల కల్పనపై ఫోకస్ పెట్టాలన్నారు సీఎం. జిల్లా నైపుణ్యాభివృద్ది కేంద్రాలు జాబ్స్ కల్పనకు కేరాఫ్ గా ఉండాలని స్పష్టం చేశారు సీఎం. ఎక్కడా ప్రభుత్వం రాజీ పడబోదని అన్నారు రేవంత్ రెడ్డి.
నేటి ప్రపంచంతో పోటీ పడేలా శిక్షణ ఉండాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడి ప్రాంత విద్యార్థులు, యువత అన్ని సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగేలా చూడాలన్నారు.