జీవన్ రెడ్డిపై అంకాపూర్ గ్రామస్థుల ఫైర్
నోరు అదుపులో పెట్టుకోక పోతే బాగుండదు
అంకాపూర్ – ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు అంకాపూర్ గ్రామస్థులు. మకర సంక్రాంతి రోజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై అభిమానంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని కానీ తమను పట్టించు కోలేదని ఆరోపించారు.
ఆపై తమ ప్రాంతానికి చెందిన రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. గ్రామస్థులంతా మీడియాతో మాట్లాడారు. ఇప్పటి దాకా అంకాపూర్ పల్లెకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. అడ్డగోలుగా నీతి తప్పిన మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు సాగించిన అక్రమాలు, దౌర్జన్యాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇకనైనా వళ్లు, నోరు జాగ్రత్త పెట్టుకుంటే మంచిదని లేక పోతే చెట్టుకు కట్టేసి చెప్పులు మెడకేసి కొడతామని హెచ్చరించారు.
పదవి పోయిందన్న అక్కసుతో నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎవరూ ఊరుకోరని , నువ్వు గనుక ఇటు వైపు వస్తే తమ సంగతి ఏమిటో చూపిస్తామని అన్నారు. ఓడి పోయినా ఇంకా బుద్ది తెచ్చుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.