జై భారత్ మేనిఫెస్టో విడుదల
రైతులు..నిరుద్యోగులకు భరోసా
అమరావతి – జై భారత్ పార్టీ చీఫ్, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ గురువారం తమ పార్టీకి సంబంధించిన మేని ఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు కోవడం కోసం ప్రయత్నం చేశామన్నారు.
రైతులకు ప్రతి నెలా రూ. 5 వేలు ఇస్తామని, వడ్డీ లేని రుణాలు అందజేస్తామని, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎకరానికి రూ. 15 వేల నష్ట పరిహారంతో పాటు ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ప్రతి ఏటా జనవరి 26న గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అన్ని వర్గాల వారికి అండగా ఉండేలా తమ మేనిఫెస్టోను తయారు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో ఏపీని ఏలిన వారంతా మాయ మాటలు చెప్పారని, ప్రజలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేకించి వేల సంఖ్యలో జాబ్స్ ఉన్నా ఎందుకని భర్తీ చేయలేక పోయారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు జేడీ లక్ష్మీ నారాయణ.