టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి
ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళి సై
హైదరాబాద్ – టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. గతంలో సీఎం కేసీఆర్ హయాంలో ఎక్కువ కాలం డీజీపీగా పని చేశారు మహేందర్ రెడ్డి.
ఇదిలా ఉండగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ను కూడా సంప్రదించినట్లు సమాచారం. కానీ ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. పేపర్ లీకేజీలు, కేసుల దాకా వెళ్లాయి.
ప్రభుత్వం మారింది. సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక జనార్దన్ రెడ్డి, సభ్యులను రాజీనామా చేయాలని కోరారు. దీంతో వారు తమ రాజీనామాలను గవర్నర్ తమిళి సై కి అందజేశారు. కొంత కాలం పాటు వాటిని ఆమోదించ లేదు.
విషయం అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి త్వరగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఇందుకు పూర్తి కాలం చైర్మన్, సభ్యులను నియమించేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు విన్నవించారు.
దీంతో ఎట్టకేలకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆయన నియామకాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు.