DEVOTIONAL

టీటీడీకి ఆర్గానిక్ నెయ్యి విరాళం

Share it with your family & friends

ప‌రాగ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ
తిరుమ‌ల – తిరుమ‌ల‌లో కొలువు తీరిన‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌కు కోట్లాది మంది భ‌క్త బాంధ‌వులు మొక్కులు చెల్లించుకుంటారు. స్వామిని న‌మ్ముకుంటే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని ప్ర‌గాఢ విశ్వాసం.

తాజాగా పుణేకు చెందిన ప‌రాగ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వ‌ర్యంలోని భాగ్య‌ల‌క్ష్మి డెయిరీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి రూ. 22 ల‌క్ష‌ల విలువైన 1,000 కేజీల ఆర్గానిక్ నెయ్యిని విరాళంగా అంద‌జేసింది. సంస్థ చైర్మ‌న్ దేవేంద‌ర్ షా, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ అక్షాలిషా త‌ర‌పున ప‌ల‌మేరులో ఉన్న భాగ్య‌ల‌క్ష్మి డెయిరీ వైస్ ప్రెసిడెంట్ సంజ‌య్ న‌క్రా బృందం విరాళాన్ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డికి అంద‌జేసింది.

ఈ నెయ్యిని ఉగ్రాణంలో ప‌డి పోటు సూప‌రింటెండెంట్ కృష్ణ‌మూర్తికి ఈవో స‌మ‌ర్పించారు. స్వామి వారి కోసం భ‌క్త బాంధ‌వులు వివిధ ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది టీటీడీ. ఇదిలా ఉండ‌గా సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.