తండ్రి బాటలో తనయ
విజయవాడ – ఏపీలో ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ నుంచి కొందరు జంప్ అయితే ప్రతిపక్షంలో కీలకమైన నాయకులు పవర్ లో ఉన్న పార్టీ వైపు చూస్తున్నారు. దీంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
తాజాగా తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ఎంపీ కేశినేని నాని తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలం నుంచీ ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదంటూ స్పష్టం చేయడంతో షాక్ కు గురయ్యారు నాని.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇదే పార్టీ నుంచి తన కూతురు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆమె కూడా తండ్రి బాటలోనే ప్రయాణం చేస్తానని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది.
తాను తన కార్పొరేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో తాను, తన తండ్రి కేశినేని నాని ఏ పార్టీలో చేరుతామనే విషయంపై క్లారిటీ ఇస్తామని స్పష్టం చేసింది కేశినేని శ్వేత.