డ్రగ్స్ కేసులో డైరెక్టర్ కు ఊరట
పరీక్షల్లో లేదని తేలిందన్న పోలీసులు
హైదరాబాద్ – టాలీవుడ్ లో రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు కలకలం రేపింది. ఈ కేసులో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి తనయుడు వివేకానందతో పాటు మోడల్ లిషి గణేష్ , ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. దీంతో మరోసారి టాలీవుడ్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.
కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే విడిచి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు డైరెక్టర్ క్రిష్ కు నోటీసులు పంపించారు. వాటిని బేఖాతర్ చేస్తూ ముంబైకి చెక్కేశాడు.
విచిత్రం ఏమిటంటే తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. అయినా తమ ముందు డ్రగ్స్ పరీక్షలకు హాజరు కావాల్సిందేనంటూ పోలీసులు ఆదేశించారు.
దీంతో మనోడు గత్యంతరం లేక హాజరు కావడం, అందులో పాజిటివ్ కాకుండా నెగటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నాడు. లేక పోతే ఈపాటికి క్రిష్ ను అరెస్ట్ చేసి ఉండేవారు.