తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం
ఢిల్లీ – ఢిల్లీ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి చెందారు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణీకులు స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ లోని 14, 15 ప్లాట్ ఫారమ్ లలో రాత్రి 8 గంటల ప్రాంతంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్టేషన్ లో పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు భద్రతా దళాలను మోహరించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు రైల్వే శాఖ మంత్రి అశ్విన వైష్ణవ్.
ఘటనా స్థలానికి నాలుగు అగ్నమాపక యంత్రాలు చేరుకున్నాయని, పరిస్థితి అదుపులో ఉందన్నారు. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ (NDLS) వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. ఢిల్లీ పోలీసులు, RPF (రైల్వే పోలీసు దళం) చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆకస్మిక రద్దీని తొలగించడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.