ENTERTAINMENT

త‌మిళ నాట ప్రిన్స్ హ‌ల్ చ‌ల్

Share it with your family & friends


ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమానుల పోస్ట‌ర్

త‌మిళ‌నాడు – తెలుగు సినీ న‌టుడు ప్రిన్స్ మ‌హేష్ బాబు కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. త‌ను అంద‌రితో క‌లిసి మెలిసి ఉంటాడు. ఎక్క‌డా భేష‌జం అంటూ ప్ర‌ద‌ర్శించేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఎలాంటి వివాదాస్ప‌ద అంశాల జోలికి వెళ్ల‌రు. త‌న ప‌నేదో త‌ను చేసుకుంటూ ఉంటారు. అంతే కాదు సినిమా ఒప్పుకుంటే షూటింగ్ కు వెళ‌తారు. ఏ మాత్రం స‌మ‌యం చిక్కినా కుటుంబానికి స‌మ‌యం కేటాయిస్తారు. ఇంకాస్త వీలు కుదిరితే విదేశాల‌కు త‌న భార్య న‌మ్ర‌త‌, కూతురు సితార‌, కొడుకు గౌత‌మ్ తో క‌లిసి వెళ‌తారు.

ప్ర‌స్తుతం త‌ను త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన గుంటూరు కారంలో న‌టించాడు. ఇందులో శ్రీ‌లీల‌తో పాటు మీనాక్షి చౌద‌రి న‌టించింది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ , ట్రైల‌ర్ విడుద‌లైంది. అంచ‌నాల‌కు మించి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇక ఓవ‌ర్సీస్ లో టికెట్లు ముంద‌స్తుగా అమ్ముడు పోవ‌డంతో గుంటూరు కారం చిత్ర యూనిట్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక మ‌హేష్ బాబుకు త‌మిళ‌నాడులో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయ‌న‌కు అక్క‌డ టాప్ హీరోలో స‌త్ సంబంధాలు ఉన్నాయి. వీరిలో ద‌ళ‌ప‌తి జోసెఫ్ విజ‌య్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తాజాగా గుంటూరు కారం మూవీ విడుద‌ల సంద‌ర్భంగా మ‌హేష్ బాబు, విజ‌య్ తో క‌లిపి పోస్ట‌ర్ల‌ను వేశారు. సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరారు.