DEVOTIONAL

తిరుమ‌ల‌లో ప‌చ్చ‌ద‌నం పెంచాలి

Share it with your family & friends

జేఈవో వీర‌బ్ర‌హ్మం పిలుపు

తిరుప‌తి – భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు టీటీడీ ఆలయాల వద్ద పచ్చదనాన్ని పెంపొందించాలని జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో అధికారులతో ఆయన వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీ ఆలయాలతో పాటు అలిపిరి వద్ద పచ్చదనాన్ని పెంపొందించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ ఖాళీ స్థలాల్లో మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుని మొక్కల పెంపకం చేపట్టాలన్నారు.

శేషాచల అడవుల్లో అకేషియా చెట్ల స్థానంలో ఔషధ మొక్కలు పెంచాలని చెప్పారు. 2025 టీటీడీ క్యాలెండర్లను స్థానిక ఆలయాల చిత్రాలతో మరింత ఆకర్షణీయంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీలో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ సమీక్షలో డెప్యూటీ ఈవో గోవింద రాజ‌న్, డిఎఫ్వో శ్రీనివాస్, రవాణా విభాగం జియం శేషారెడ్డి, డిఈవో భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.