Saturday, April 12, 2025
HomeNEWSANDHRA PRADESHతిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్తులు

తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్తులు

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.06 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరు పొందిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో నిండి పోయింది. సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చారు. రోజు రోజుకు పెరుగుతున్న భ‌క్తుల సంఖ్య‌ను దృష్టిలో పెట్టుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) చ‌ర్య‌లు చేప‌ట్టింది. శ్రీ‌వారి భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తోంది.

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 76 వేల 41 మంది ద‌ర్శించుకున్నారు. 28 వేల 336 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.06 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.

శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు 10 కంపార్ట్మెంట్ల‌లో వేచి ఉన్నార‌ని తెలిపింది. ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం 8 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ని వెల్ల‌డించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేందుకు గాను టీటీడీ తాజాగా టోకెన్లు జారీ చేసింది.

మ‌రో వైపు తిరుమ‌ల‌లో ఈనెల 25న శ్రీ‌రామకృష్ణ తీర్థ కోటి ఉత్స‌వం జ‌ర‌గ‌నుంద‌ని తెలిపింది. అంతే కాకుండా అయోధ్య లోని శ్రీ‌రామ మందిరానికి ల‌క్ష ల‌డ్డూల ప్ర‌సాదాన్ని పంపించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments