Friday, April 4, 2025
HomeSPORTSతెలంగాణ‌లో క్రికెట్ అభివృద్దికి శ్రీ‌కారం

తెలంగాణ‌లో క్రికెట్ అభివృద్దికి శ్రీ‌కారం

హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షనపల్లి జగన్ మోహన్ రావు

హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచే శ్రీకారం చుట్టామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు అన్నారు.

సీఎం రేవంత్ మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ అని, అందుకే మహబూబ్‌నగర్‌ను ఎంచుకున్నామ‌ని తెలిపారు. రూ.25 లక్షలతో పూర్తయిన మహబూబ్ నగర్ స్టేడియం అభివృద్ధి పనులను హెచ్ సీఏ కార్యవర్గ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జగన్మోహన్ రావు ప్రారంభించారు.

హెచ్‌సీఏ నిధులతో ఈ స్టేడియం నిర్మించారు. ఈ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం, పెవిలియన్, డ్రెస్సింగ్ రూమ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో స్టేడియంలు నిర్మిస్తామని, హెచ్‌సీఏ అకాడమీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రతిభ కనబరిచిన గ్రామీణ క్రీడాకారులను బయటకు తీసుకొచ్చి రాష్ట్ర జట్లకు ఆడే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 25 నుంచి జరగనున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ పూర్తయిన తర్వాత జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తానని స్ప‌ష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రావుతో పాటు హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్‌, ఉపాధ్యక్షుడు దల్జీత్‌సింగ్‌, కోశాధికారి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ సునీల్‌ అగర్వాల్‌, మహబూబ్‌నగర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రాజ్‌శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments