తెలంగాణలో భారీ పెట్టుబడులు
సీఎంను కలిసిన హెచ్ సీసీబీ ప్రతినిధులు
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఉపాధి కల్పనకు పెద్ద పీట వేసేలా చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన వరుసగా సమీక్షలు చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేస్తుందన్నారు.
ఇతర రాష్ట్రాలకు ధీటుగా తెలంగాణ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలలో ముందంజలో ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఔత్సాహికులైన వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు.
ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పిలుపు మేరకు హెచ్ సీసీబీ కంపెనీకి చెందిన ప్రతినిధులు రేవంత్ ను కలుసుకున్నారు సచివాలయంలో.
కంపెనీ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ , సస్టైయినబిలిటీ చీఫ్ హిమాన్షు ప్రియదర్శి నేతృత్వంలో సీఎంను కలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లో కొనసాగుతున్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో తమ కంపెనీ రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉందని రేవంత్ రెడ్డికి తెలిపారు.