నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
అరుణాచల్ ప్రదేశ్ – వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. అధికారం ఉంది కదా అని ప్రతిపక్షాలపై దాడి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన జైరాం రమేష్ వాహనంపై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
తాను భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా తన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో తాను బస్సు దిగాల్సి వచ్చిందని, ఆ వెంటనే ఆందోళనకారులు పారి పోయారని మండిపడ్డారు.
ఇదేనా మీ సంస్కృతి, ఇదేనా మీ నాగరికత అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. బీజేపీ ఈ దేశంలో మతపరమైన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాను ఒక్కటే ఉండాలని అనుకుంటోందని, ఇది ప్రజాస్వామ్యం అనిపించు కోదని స్పష్టం చేశారు.
ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉంది. అంతే కాదు తమ పరంగా అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఉంది. అలాంటిది గుర్తించబోమని అంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు రాహుల్ గాంధీ.