ANDHRA PRADESHNEWS

దిగి పోవాల్సి వ‌స్తే బాధ ప‌డ‌ను

Share it with your family & friends

ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్

తిరుప‌తి – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్ప‌టికిప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగి పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చినా తాను ఏమీ అనుకోన‌ని అన్నారు. ఇందులో ఎలాంటి విచార ప‌డాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ తో జ‌గ‌న్ రెడ్డి ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఏపీ రాజ‌కీయాల‌లో సీఎం చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

తాను ఏనాడూ ప‌ద‌వి కోసం పాకులాడ లేద‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ రెడ్డి. తాను ఏపీలో కొలువు తీరి 56 నెల‌ల కాలం అవుతోంద‌ని, దేశంలో ఎక్క‌డా , ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాల‌లో అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఏపీ అభివృద్దే ధ్యేయంగా ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని, అప్పులు చేయ‌కుండా అభివృద్ది ఎలా అవుతుంద‌నేది మీరే చెప్పాల‌న్నారు. తాను ప‌ని చేసేందుకు ఇష్ట ప‌డ‌తాన‌ని, స్వంతంగా ప్ర‌చారం చేసుకోనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.